Raj Tarun : హీరో రాజ్‌ తరుణ్‌ లవ్ కేసులో కొత్త ట్విస్ట్.. లావణ్యకు పోలీసులు బిగ్ షాక్?

రాజ్‌తరుణ్ కేసులో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. రాజ్‌తరుణ్ పై చేసిన ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు సమర్పించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు. కానీ ఆమె స్పందించలేదు. పోలీసుల ఫోన్‌కు సైతం రియాక్ట్‌ కాలేదు. దీంతో కేసు క్లోజ్‌ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.

Raj Tarun : హీరో రాజ్‌ తరుణ్‌ లవ్ కేసులో కొత్త ట్విస్ట్.. లావణ్యకు పోలీసులు బిగ్ షాక్?
New Update

Another Big Twist In Raj Tarun - Lavanya Case : టాలీవుడ్ (Tollywood) యువ నటుడు రాజ్‌తరుణ్ (Raj Tarun) లవ్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని చివరికి మరో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) తో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్య ఆరోపణలను కొట్టిపారేశాడు.

లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలనీ, తననే ఆమె టార్చర్‌ పెడుతోందని మీడియా వేదికగా చెప్పాడు. ఇక తాజాగా ఈ కేసులో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. రాజ్‌ తరుణ్‌ తనను ప్రేమించాడని,పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని లావణ్య పోలీసులకు 4 పేజీల్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ కు సంబంధించి చేసిన ఫిర్యాదులో ఆధారాలు ఇవ్వాలని లావణ్యకు పోలీసుల నోటీసులు పంపారు.

Also Read : ‘గేమ్ ఛేంజర్’ వల్లే ‘ఇండియన్ 2’ లో ఛాన్స్ వచ్చింది : SJ సూర్య

తాను చేసిన ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు సమర్పించాలని పోలీసులు డిమాండ్ చేయగా.. ఇప్పటివరకూ లావణ్య (Lavanya) నోటీసులపై స్పందించలేదు. అటు పోలీసుల ఫోన్‌కు సైతం రియాక్ట్‌ అవ్వకపోవడంతో కేసు క్లోజ్‌ చేసే ఆలోచనలో నార్సింగి పోలీసులు ఉన్నట్లు తెలిసింది. రేపు కోర్టు అనుమతితో కేసు క్లోజ్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

#lavanya #malvi-malhotra #actor-raj-tarun-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe