/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-54-jpg.webp)
Hollywood : హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నే హాత్వే(Anne Hathaway) సంచలన విషయం బయటపెట్టారు. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తను నటించిన తాజా చిత్రం ‘ది ఐడియా ఆఫ్ యు’(The Idea Of You) ఓటీటీ(OTT) అమెజాన్ ప్రైమ్(Amazon) వీడియోలో మే 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నటి.. ఓ సినిమాలో ఎదురైన భయంకరమైన సంఘటన బయటపెట్టింది.
View this post on Instagram
Also Read : నా కూతురు ఎవరితో తిరిగిన తప్పులేదు.. చుంకీ పాండే షాకింగ్ కామెంట్స్!
కెమిస్ట్రీ ఎలా ఉంటుందో టెస్ట్ చేయాలంటూ..
‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక సినిమా ఆడిషన్‌కు వెళ్లాను. హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో టెస్ట్ చేయాలంటూ పది మంది అబ్బాయిలని ముద్దు పెట్టుకోమన్నారు. కెమిస్ట్రీ ఎలా ఉంటుందో టెస్ట్ చేసేందుకు నటీనటులను కలిసి నటించమని అడగడం కామన్. కానీ పది మందిని కిస్(Kiss) చేయమని చెప్పడం సరైనది కాదు. వరస్ట్ ప్రాసెస్. అప్పుడే కష్టంగా భావిస్తే జీవితంలో ముందుకెళ్లలేమనే ఆలోచనతో ఉండేదాన్ని. దీంతో దర్శకనిర్మాతలు చెప్పినట్లు నడుచుకునేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది.