/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-17-10-jpg.webp)
Animal OTT Release : సందీప్ వంగ (Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చిన యానిమల్ (Animal) మూవీ రణ్‍బీర్ (Ranbir Kapoor) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సినిమా విడుదలైన మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించినప్పటికీ.. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 1 థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. వైలెంట్ బోల్డ్ యాక్షన్ మూవీగా థియేటర్స్ లో దుమ్ము రేపిన ఈ చిత్రం ఓటీటీలో కూడా సత్తా చాటుతోంది.
ఓటీటీలో యానిమల్ హవా
జనవరి 26 న నెట్ ఫ్లిక్స్ వేదిక పై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమైన ఈ చిత్రం టాప్ వ్యూస్ తో అదరగొడుతుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫార్మ్ పై టాప్ 1 ట్రెండింగ్ మూవీగా సాగుతోంది. తాజాగా యానిమల్ టీమ్ హ్యస్ ట్రెండింగ్ అంటూ ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సలార్ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవుతోంది. దీంతో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సలార్ వర్సెస్ యానిమల్ మధ్య గట్టి పోటీ జరుగుతోంది.
యానిమల్ చిత్రాన్ని T-Series ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్, కృషన్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో రష్మిక మందన (Rashmika Mandanna) కథానాయికగా నటించారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా.. అనిల్ కపూర్ రణ్బీర్ కపూర్ తండ్రిగా కనిపించారు. బిగ్గెస్ట్ హిట్ యానిమల్ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. యానిమల్ పార్క్ (Animal Park) మరింత వైల్డ్ గా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. యానిమల్ మూవీ మ్యూజికల్ హిట్ గా కూడా మంచి రెస్పాన్స్ పొందింది.
#Animal conquers @NetflixIndia as it is trending at #1 on the platform 🔥https://t.co/FosKOFbGgw#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep pic.twitter.com/EpP6IZvOwb
— Animal The Film (@AnimalTheFilm) January 28, 2024