Ram Charan : బుచ్చిబాబు మూవీలో రామ్‌ చరణ్ పక్కన దేవర బ్యూటీ.. !

ఉప్పెన ఫేం దర్శకుడు సాన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ నటించబోతున్నట్లు బోనీ కపూరే స్వయంగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

New Update
Ram Charan : బుచ్చిబాబు మూవీలో రామ్‌ చరణ్ పక్కన దేవర బ్యూటీ.. !

Devara Beauty : రామ్‌చరణ్‌(Ram Charan) వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చరణ్‌ శంకర్ సినిమా '' గేమ్ ఛేంజర్''(Game Changer) షూటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. ఇంకా ఈ సినిమా పూర్తి కాకముందే చరణ్‌ తన తరువాత సినిమా గురించి కూడా అనౌన్స్ చేసేశాడు. ఉప్పెన సినిమాతో ఎన్నో అవార్డులను అందుకున్న సాన బుచ్చిబాబు(Buchi Babu)  దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ సినిమా నిర్మించబోతున్నట్లు రెండు నెలల ముందే ప్రకటించారు.

ఈ సినిమా శ్రీకాకుళం ప్రాంతీయ యాస, భాషల నేపథ్యంలో తీస్తున్నట్లు బుచ్చిబాబు ప్రకటించారు. ఈ చిత్రంలో నటించేందుకు నటీనటులకు ఆడిషన్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ సాగుతోంది. అతి త్వరలోనే చరణ్‌ ఈ సినిమా షూటింగ్‌ లో కూడా పాల్గొనబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తున్నట్లు స్వయంగా బోనీ కపూర్‌ నే ప్రకటించారు.

ప్రస్తుతం జాన్వీ దేవర(Devara) సినిమాలో ఎన్టీఆర్(NTR) సరసన నటిస్తుంది. ఆ సినిమా పూర్తవగానే చరణ్‌ సినిమాలో జాన్వీ పాల్గొనన్నుట్లు చిత్ర బృందం తెలిపింది. వెండి తెర మీద మెగాస్టార్ చిరంజీవి - శ్రీదేవిలది ఎంత పెద్ద హిట్‌ కాంబినేషన్‌ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు వారి వారసులు అయినటువంటి చరణ్‌, జాన్వీ జోడి కడుతున్నారంటే మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ సినిమాలో జాన్వీ చరణ్‌ సరసన ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు తెరకు జాన్వీ ముందుగా దేవర సినిమాతో రాబోతుంది. దేవర చిత్రం ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్‌ .

ఇదిలా ఉంటే జాన్వీ గురించి మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే.. పుష్ప 2 సినిమాలో కూడా జాన్వీ నటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో జాన్వీతో ఓ ప్రత్యేక గీతం చేయించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్‌ జూన్ లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని ఒకరి మృతి!

Advertisment
తాజా కథనాలు