Anganwadi's: మూడు నెలలు ఆగండి..మేము నొక్కే బటన్లతో మీ అడ్రస్ లు గల్లంతే: ఏపీ అంగన్వాడీలు! తమ సమస్యలు పరిష్కారించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం 21వ రోజుకు చేరుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన చేపట్టారు By Bhavana 01 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీ (AP) వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ వర్కర్ల సమ్మె (Anganwadi Workers) 21 రోజులకు చేరుకుంది. ఈ క్రమంలోనే నూతన సంవత్సరం(New Year) సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముగ్గులు వేసి అంగన్వాడీ సిబ్బంది వినూత్నంగా నిరసన తెలిపింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం (Macilipatnam) లో వైసీపీ (YCP) తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం నాడు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాల్సిన మమ్మల్ని రోడ్డు పాలు చేసిందే కాక..నడిరోడ్డు మీద కూర్చోపెట్టారని కార్యకర్తుల మండిపడ్డారు. '' సీఎం జగన్ ది రాతి గుండె అని తెలిసింది. ఇన్ని రోజుల నుంచి నడిరోడ్డు మీద పడి ఆందోళనలు చేస్తున్న మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు కనికరం లేదంటూ దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో 1.06 లక్షల మంది సమ్మెలో ఉంటే ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అంటూ ప్రశ్నించారు. '' ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా..? మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే మాకు ఇలా అన్యాయం చేస్తారా? ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదు. జగన్ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలి..కాదు కూడదు అంటే మరో మూడు నెలల్లో మేము నొక్కే బటన్ తో వైసీపీ అడ్రస్ రాష్ట్రంలో గల్లంతవుతుంది'' అని హెచ్చరించారు. మరో రెండు రోజుల్లో మా డిమాండ్ల పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీలు తెలిపారు. '' ముఖ్యమంత్రి తన పుట్టిన రోజు కానుకగా వేతనాలు పెంచుతారని భావించాం..అది కాకుంటే క్రిస్మస్ రోజు అయినా జీతాలు పెంపు విషయం గురించి ప్రకటన చేస్తారని అనుకున్నాం. కొత్త ఏడాది కానుకగా అయినా డిమాండ్లను పరిష్కరిస్తారని అనుకున్నాం..కానీ, కుటుంబాలతో ఆనందంగా జరుపుకోవాల్సిన కొత్త సంవత్సరాన్ని ఇలా రోడ్లు మీద చేసుకుంటున్నాం..మా సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ ఎత్తిన ఎర్ర జెండా దింపేది లేదు.. ’ అని శపథం చేశారు. Also read: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా బంగారం పట్టివేత! #ycp #jagan #ap #anganwadi-workers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి