Mulugu : అంగన్‌వాడీ టీచర్‌ దారుణ హత్య.. తాడ్వాయి అడవుల్లో ఘోరం!

ఏటూరు నాగారంకు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ సుజాత దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. మెడకు స్కార్ఫ్ బిగించి చంపి, ఆమె వేసుకున్న నాలుగు తులాల బంగారంతో పాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Update
Mulugu : అంగన్‌వాడీ టీచర్‌ దారుణ హత్య.. తాడ్వాయి అడవుల్లో ఘోరం!

Anganwadi Teacher Murder Case : ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి అడవుల్లో ఓ అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య(Murder)కు గురైంది. ఆమె మెడకు స్కార్ఫ్ బిగించి హత్య చేశారు. ఆపై బంగారం, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. ఈ హత్య అనుమానాస్పదంగా ఉండగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఏటూరు నాగారంకు చెందిన సుజాత..
ములుగు జిల్లాలో ఓ అంగన్‌వాడీ టీచర్(Anganwadi Teacher) దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏటూరు నాగారంకు చెందిన సుజాత అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. తాడ్వాయు మండలంలోని కాటాపురం సెంటర్‌లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం ( మే 14) ఉదయం ఆమె విధులకు హాజరైంది.

విధులు ముగిసిన తర్వాత సాయంత్రం కాటాపురం నుంచి ఏటారు నాగరం బయల్దేరింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆమె మంగళవారం సాయంత్రం ఇంటికి చేరుకోలేదు. బధవారం ఉదయం తాడ్వాయి అడవుల్లోకి తునికాకు కోసం వెళ్లిన కూలీలకు ఓ మహిళ మృతదేహం కనిపించింది. కంగారుపడిన కూలీలు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు హత్యచేయబడిన మహిళ అంగన్‌వాడీ టీచర్ సుజాతగా గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబీలకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబీకులు ఆమె ఒంటిపై బంగారం లేకపోవటాన్ని గుర్తించారు. మెడకు స్కార్ఫ్ బిగించి ఆమెను హత్య చేయగా.. నాలుగు తులాల బంగారంతో పాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. దీంతో ఈ హత్య బంగారం కోసం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు స్థానిక ఎస్సై వెల్లడించారు. అయితే పూర్తి విచారణ తర్వాత అసలేం జరిగిందనేది తేలనుంది.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు