TDP: 15 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా టీడీపీ జెండా ఎగరేసిన అంగన్వాడీ టీచర్..!
అల్లూరి జిల్లా రంపచోడవరం టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా మారింది.టీడీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పై 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు.