రేపు మధ్యాహ్నం 12 గంటలకు షాకింగ్ నిజాలు.. వైసీపీ సంచలన ట్వీట్! వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సంచలన పోస్టు చేసింది. 'ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్, అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు దాన్ని బయటపెట్టపోతున్నామని' ట్వీట్ చేసింది. దీంతో ఏదో పెద్ద స్కామ్‌ను బయటబెట్టబోతున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారు. By B Aravind 23 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై అధికారం కోల్పోయిన వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై కూడా కూటమి ప్రభుత్వం వైసీపీకి తీవ్ర ఆరోపణలు చేసింది. మరోవైపు ఆ పార్టీకి చెందిన నేతలు విజయసాయి రెడ్డి, కుక్కల విద్యాసాగర్‌ల వ్యవహారం కూడా తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. కూటమి ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు చేసేందుకు ఇంతవరకు వైసీపీకి సరైన అంశం దొరకలేదు. అయితే తాజాగా వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సంచలన పోస్టు చేసింది. Also Read: లోకేష్.. అందుకే నిన్ను పప్పు అనేది: జగన్ సెటైర్లు 'ట్రూత్ బాంబ్ కోసం సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు దాన్ని పడేయబోతున్నాం. వేచి ఉండండి' అంటూ ట్వీట్ చేసింది. దీనికి 'ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్' అనే పోస్టర్‌ను జతచేసి పోస్ట్ చేసింది. దీంతో వైసీపీ ఏ వ్యవహారాన్ని బయటబెట్టపోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. ఏదో పెద్ద స్కామ్‌ను బయటబెట్టబోతున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారు. Get ready for the truth bomb 💣 Dropping on 24th Oct at 12 PM! Stay tuned ❗#BigExpose pic.twitter.com/IxkzYt2N4x — YSR Congress Party (@YSRCParty) October 23, 2024 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ స్కామ్‌ను బయటకు తీసి అప్పటి విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. ఈ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన చంద్రాబాబు.. ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలతో జతకట్టి అధికారంలోకి వచ్చి మళ్లీ సీఎం అయ్యారు. మరీ ఇప్పుడు వైసీపీ ఓ పెద్ద వ్యవహారాన్ని బయటబెట్టబోతున్నామని ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. చంద్రబాబును టార్గెట్ చేశారా ? లేదా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు ? లేదా రెండు పార్టీలపై పెద్ద ఎత్తున ఏదైనా అంశాన్ని బయటపెడతారా అనేది దానిపై రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. Also Read: వైసీపీకి కీలక నేత రాజీనామా! #jagan #andhra-pradesh-politics #ysrcp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి