లోకేష్.. అందుకే నిన్ను పప్పు అనేది: జగన్ సెటైర్లు

AP: రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని అన్నారు జగన్. మహిళల భద్రత కోసం తెచ్చిన దిశా వ్యవస్థను రద్దు చేశారని.. ఆ యాప్‌ను లోకేష్ కాల్చివేశారని మండిపడ్డారు. అందుకే లోకేష్ ను అందరు పప్పు అని అంటారని సెటైర్లు వేశారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే అని అన్నారు.

New Update
YS Jagan Songs

Jagan: ఈరోజు గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్‌ పర్యటించారు. సహన కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. శాంతిభద్రతలు ఎలా దిగజారాయో ఈ ఘటన చూస్తే తెలుస్తోందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి ఉండగా అక్క చెల్లెమ్మలకు భరోసా ఉండేదని అన్నారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచాం అని చెప్పారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హై టెన్షన్.. ఆ నిర్మాణం కూల్చివేసిన ఆందోళనకారులు!

లైంగికంగా దాడి...

నిందితుడు నవీన్ బాబుతో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయని అన్నారు. స్థానిక ఎంపీతో కూడా సన్నిహితంగా ఉన్నాడని చెప్పారు. యువతిని ఆస్పత్రిలో పడేసి జారుకున్నాడని.. యువతి దేహంపై కమిలిన గాయాలు ఉన్నాయని చెప్పారు. నిందితుడు శారీరకంగా, లైంగికంగా దాడి చేశాడని అన్నారు. యువతిపై మృగాళ్లలా దాడి చేశారు.. ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా.. ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీకి చెందినవాడు కాబట్టే.. నిందితుడ్ని నిస్సిగ్గుగా కాపాడుకుంటున్నారని అన్నారు. స్థానిక మంత్రి, హోంమంత్రి కనీసం స్పందించలేదని ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!

అందుకే లోకేష్ ను పప్పు అనేది...

పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారని అన్నారు జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 4 నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని చెప్పారు. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.  రెడ్ బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదని చెప్పారు. గతంలో దిశ యాప్ తో 10 నిమిషాల్లో సాయం అందేది అని అన్నారు. దిశ యాప్ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడినట్లు చెప్పారు. 18 దిశ పీఎస్ లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశామన్నారు.

ఇది కూడా చదవండి: 80 విమానాలకు బాంబు బెదిరింపులు

దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?.. అందుకే లోకేష్ ను పప్పు అనేది అని సెటైర్లు వేశారు. లోకేష్ పక్కనే ప్రస్తుత హోంమంత్రి కూడా ఇదే పనిచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు భద్రత లేదని అన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న మేం బాధిత కుటుంబాలను ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. ఆరు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: షర్మిల, విజయమ్మకు జగన్ షాక్.. పిటిషన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు