YS Jagan: రేపు శ్రీకాకుళంలో జగన్ పర్యటన.. ఎందుకో తెలుసా?

ఏపీ మాజీ సీఎం జగన్ ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు. రేపు ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. ఇటీవల మరణించిన పార్టీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం జిల్లా ముఖ్య నేతలతో సమావేవం అయ్యే అవకాశం ఉంది.

New Update
YS Jagan Tour

YS Jagan Srikakulam Tour

ఈ నెల 20న అంటే రేపు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం ఇటీవల మరణించారు. రేపు రాజశేఖరం కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisment
తాజా కథనాలు