YCP: సీఎం చంద్రబాబుపై వైసీపీ సంచలన ట్వీట్!

AP: సీఎం చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ములేక సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. దమ్ముంటే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనిన్ డిమాండ్ చేసింది.

New Update
YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!

YSRCP: మాజీ సీఎం జగన్ ఏపీని అప్పులు ఊబిలోకి నెట్టారని టీడీపీ చేసిన ట్వీట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల‌ను అమ‌లు చేసే  ద‌మ్ములేక‌, రాష్ట్ర అప్పుల‌పై రోజుకొక మాట మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతూ.. సోష‌ల్ మీడియాలో కూడా అవే అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నారని ఫైర్ అయింది. సీఎం చంద్రబాబు కొన్ని ప్రశ్నలను సంధించింది. దమ్ముంటే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది.

దమ్ముందా చంద్రబాబు..?

వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో చంద్రబాబుకు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అవి...

"1- అయ్యా చంద్ర‌బాబూ.. ఒక‌సారి రూ.11 ల‌క్ష‌ల కోట్లు అని, మ‌రోసారి రూ.12.5 ల‌క్ష‌ల కోట్లు  అని..ఇంకోసారి రూ.14 ల‌క్ష‌ల కోట్లు అని ఇలా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న మీరు బ‌డ్జెట్ స‌మావేశాల్లో రాష్ట్ర అప్పులు రూ.6.46 ల‌క్ష‌ల కోట్లు  అని ఎందుకు చూపారు?

2- 2024లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.6.46 ల‌క్ష‌ల కోట్లు అని బ‌డ్జెట్ డాక్యుమెంట్‌లోని పేజీ నంబ‌ర్ 14, 16లో చూపారా?  లేదా?

3- అది ఒక్క బ‌డ్జెట్ డాక్యుమెంట్‌లోనే కాకుండా 2023–24లో కాగ్‌ రిపోర్ట్‌ (పేజీ నెం.18. 20)లో కూడా చూపారా?  లేదా?

4- నీ ప్ర‌భుత్వ హ‌యాంలో.. నీ అధికారుల‌ చేత‌.. నువ్వు ప్ర‌వేశ‌పెట్టిన నీ బ‌డ్జెట్‌లో
నీ లెక్క‌ల‌ను కాగ్ ధృవీక‌రించిన త‌ర్వాత మీ లెక్క‌ల‌ను మీరే ఒప్పుకోపోతే ఎలా?

5- మ‌రి ఇవ‌న్నీ త‌ప్పు అయితే బ‌డ్జెట్ డాక్యుమెంట్‌లో ఎందుకు పెట్టారు?" అని ప్రశ్నలు విసిరింది.

జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ... 

జగన్ పై టీడీపీ విమర్శల దాడికి దిగింది. ట్విట్టర్ లో.. "2023 మార్చి చివరినాటికి ఆ ఏడాది బడ్జెట్ లోకి రాని ఇతర రుణాలు రూ.35,114 కోట్లే అని జగన్ కేంద్రానికి చెప్పాడు. కానీ వాస్తవానికి అదనంగా మరో రూ.92,934 కోట్లు అప్పుచేసాడు. కేంద్రానికి మాత్రం ఇది దాచేసి లెక్క చెప్పాడు. ప్రభుత్వ ఖర్చుల్ని కార్పొరేషన్ ఖర్చుల్లో చూపించాడు. దాచేస్తే అప్పులు దాగుతాయా? చివరికి తీర్చాల్సింది ప్రజలే కదా." అంటూ ఆరోపణలు చేసింది. దీనికి కౌంటర్ గా వైసీపీ చంద్రబాబుపై ప్రశ్నలు కురిపించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు