అది అబద్ధం అని ప్రమాణం చేస్తారా? విజయసాయిరెడ్డికి షర్మిల సంచలన సవాల్!

'సాయి రెడ్డి గారు.. మీరు చదివింది జగన్ గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?'.. అంటూ విజయసాయిరెడ్డిపై షర్మిల ట్వీట్ చేశారు.  

New Update
Vijayasaireddy Sharmila

'సాయి రెడ్డి గారు.. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?'.. అంటూ విజయసాయిరెడ్డిపై షర్మిల ట్వీట్ చేశారు.  వైఎస్ మృతికి కారణమైన చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపారంటూ ఈ రోజు విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ ఉన్నప్పుడే షర్మిలకు ఆస్తులు పంచారన్నారు. చెల్లిపై ప్రేమతో జగన్ తన ఆస్తిలో 40 శాతం వాటా ఇస్తానన్నారన్నారు. కోర్టు కేసుల తర్వాత ఈ ఆస్తులు ఇస్తానని చెప్పాడన్నారు. కానీ జగన్ ను జైలుకు పంపించడానికి చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారని ఫైర్ అయ్యారు.  ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేశారు. 
ఇది కూడా చదవండి: AP CABINET MEET: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ!

Also Read :  చీరలో జూనియర్ అతిలోక సుందరి హొయలు ! ఫొటోలు చూస్తే ఫిదా

వైఎస్ పేరు ఛార్జిషీట్లో చేర్చించిందే జగన్..

జగన్ మోచేతి నీళ్లు తాగిన మీరు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడుతారని విజయసాయిరెడ్డిని విమర్శించారు షర్మిల. వైఎస్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదన్నారు. ఇంకా వైఎస్ మరణానికి చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్ పేరును ఛార్జిషీట్లో చేర్పించింది మీ నాయకుడు జగన్ కాదా? అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడడానికి న్యాయవాది పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవన్నారు.
ఇది కూడా చదవండి: అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి

అందుకే నా కొడుకు పెళ్లికి చంద్రబాబును పిలిచా..

వైఎస్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారని గుర్తు చేశారు. అలాగే తాను కూడా చంద్రబాబును పిలిచానన్నారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి? అంటూ ఫైర్ అయ్యారు. జగన్ కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా? అని ఫైర్ అయ్యారు. జగన్ అద్దంలో చూసుకున్నా చంద్రబాబే కనిపిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 

Also Read :  గంజాయి ముఠా గుట్టురట్టు.. 105 కేజీల డ్రగ్స్ స్వాధీనం

Advertisment
Advertisment
తాజా కథనాలు