YCP : విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?

AP: టీడీపీ కార్యాలయం దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు అరెస్ట్ కాగా.. తాజాగా సజ్జలను అరెస్ట్ చేస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. మరి సజ్జల విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాలి.

Sajjala: లోకేష్ ఒక జోకర్.. సజ్జల కౌంటర్.!
New Update

Sajjala Ramakrishna : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నిన్న నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు రావాలని నోటీసులో తెలిపారు. దీంతో సజ్జలకు అరెస్టు భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!

గత వైసీపీ ప్రభుత్వంలో 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశా. కాగా దీనిపై తాజాగా కేసు నమోదు కావడంతో ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌, తలశిల రఘురాంను ఫలు దఫాలుగా పోలీసులు ప్రశ్నించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు కొందరిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా దాడి కుట్రలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. 

ఇది కూడా చదవండి: జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు!

కాగా ఈ  కేసులో అరెస్టు భయంతో ఉన్న సజ్జల ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ ఆదేశాలు తెచ్చుకున్నారు. కానీ ఉత్తర్వులు విచారణకు అవరోధం కాదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సజ్జల విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్‌ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ముంబయి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సజ్జలను అడ్డుకోవడంతో లుక్‌ ఔట్  నోటీసుల అంశంపై వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఇప్పటికే సగానికిపైగా విచారణ పూర్తి..

ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే సగానికి పైగా విచారణ పూర్తి అయిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసులతో కలిసి తదుపరి విచారణను ముందుకు తీసుకెళ్లనున్నారు. అయితే ఈ కేేసులో సజ్జల 120వ నిందితుడిగా ఉన్నారని పోలీసులు చెప్పారు. నిందితుల జాబితాలో కొన్ని పేర్లు పునరావృత్తం అయ్యాయని... వారిలో అసలు నిందితులను నిర్ధారించుకున్న తర్వాత మిగిలిన వారి పేర్లు తొలగిస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో అగ్రనేత సుజాత?

#ycp #mangalagiri #sajjala-ramakrishna-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe