/rtv/media/media_files/2025/08/01/ys-jagan-party-resign-2025-08-01-14-43-35.jpg)
జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేత, బ్రహ్మంగారి మఠం ఎంపీపీ వీరనారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి పోస్ట్ ద్వారా పంపించారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అనివార్య కారణాలవల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు ఈ రోజు కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గాన గూడెం చెరువుకు పయనం రాజీవ్ నగర్ కాలనీ, మోరగుడి చేనేత కాలనీ, ఆర్అండ్ఆర్ కాలనీలో పెన్షన్ పంపిణీ పంపిణీ చేయనున్నారు.
బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి
— Telugu Desam Party (@JaiTDP) August 1, 2025
ఆటోలో సామాన్యుడిలా వెడలి..
ప్రజల కోసం.. ప్రజల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు..
జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో ప్రజా వేదిక వద్దకు ఆటోలో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. #పేదలసేవలో#PensionsPandugalnAP#NTRBharosaPension#IdhiManchiPrabhutvampic.twitter.com/UhdyfkWGPU
గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో కడప విమానాశ్రయానికి వెళ్లారు చంద్రబాబు. ఆయనకు ప్రొద్దుటూరు, కమలాపురం ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, పుత్త కృష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి, టీడీపీ నేతలు పుత్తా నరసింహా రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరి ప్రసాద్, సీఎం సురేష్ నాయుడు ఘన స్వాగతం పలికారు. అయితే.. కడపలో సీఎం పర్యటన జరుగుతున్న సమయంలో జిల్లాకు చెందిన ఎంపీపీ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. వీరనారాయణ రెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
🚨BIG BREAKING 🚨
— Hari Pranay (@HariPranay4TDP) August 1, 2025
పులివెందులలో వైసిపికి, వైఎస్సార్ కుటుంబానికి, జగన్ కు బారి ఎదురుదెబ్బ పులివెందులకు సంబంధించిన పెద్ద తలకాయలు, వైఎస్సార్ కుటుంబానికి జగన్ కి అత్యంత సన్నిహితుడైన పుష్పనాథ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టిడిపి పార్టీ లో చేరారు https://t.co/LSMhFAWDc3pic.twitter.com/iHui66YuoI
టీడీపీలో చేరిన మరో పులివెందుల నేత..
జగన్ కంచుకోట పులివెందులకు చెందిన మరో వైసీపీ నేత సైతం ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ కుటుంబానికి ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పుష్పనాథ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈరోజు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి కడప జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గత మహనాడును సైతం ఇక్కడే నిర్వహించారు. దాదాపు మూడు రోజుల పాటు చంద్రబాబు ఇక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజా చేరికలని.. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.