/rtv/media/media_files/2024/11/06/LlASO9URy53yXrEkkWEt.jpg)
Ramayana
Ramayana: బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం'. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సెట్స్ నుంచి సాయి పల్లవి, రణ్ బీర్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీకయ్యాయి. కానీ మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన లేకపోవడంతో ప్రేక్షకులు సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్
రామాయణం అఫీషియల్ అప్డేట్
ఎట్టకేలకు సినిమాపై అధికారిక ప్రకటన చేశారు. 'రామాయణం' రెండు పార్టులుగా రానున్నట్లు తెలియజేస్తూ.. మూవీ విడుదల తేదీలను ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి సెకండ్ పార్ట్ విడుదల కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా.. సీత పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. కేజీఎఫ్ స్టార్ యష్ రావణుడిగా, కైకేయి పాత్రలో లారా దత్త, శూర్పణకాగా రకుల్ ప్రీత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చేతులు కలిపారు.
MASSIVE DEVELOPMENT... 'RAMAYANA' PART 1 & 2 RELEASE DATE ANNOUNCEMENT... Mark your calendars... #NamitMalhotra's #Ramayana - starring #RanbirKapoor - arrives in *theatres* on #Diwali 2026 and 2027.
— taran adarsh (@taran_adarsh) November 6, 2024
Part 1: #Diwali2026
Part 2: #Diwali2027
Directed by #NiteshTiwari. pic.twitter.com/3BRWR0bg2L
Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!
Also Read: 'బాధ కూడా ఉంది..' ఆ విషయంలో తప్పు చేశా.. సమంత ఎమోషనల్