జగన్ సంచలనం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరు బాట!

AP: కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందన్నారు MP విజయసాయి రెడ్డి. ముస్లింలకు ఉండాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీనిపై BJPతో పార్లమెంట్‌లో కొట్లాడుతామన్నారు. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే సహించమని హెచ్చరించారు.

jagan modi
New Update

Vijaya Sai Reddy: మాజీ సీఎం జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని అన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందని అన్నారు. ఈ బిల్లును క్యాబినెట్ లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ఏ మంత్రి విబేధించినా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఈ బిల్లుని రామ్మోహన్ నాయుడు ఆమోదించారని అన్నారు.

ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు!

8 అంశాలను...

వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైసీపి వ్యతిరేకించిందని అన్నారు విజయసాయిరెడ్డి. వైసీపి తరఫున డీసెంట్ నోట్ కూడా ఇచ్చినట్లు చెప్పారు. ముస్లింల తరఫున వైసీపి ఎప్పుడూ నిలపడే ఉంటుందని భరోసా ఇచ్చారు. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుందని.. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైసీపి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి:  జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు

ఆ ఆరోపణలు తప్పు...

రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉందని అన్నారు. ఆ భూముల్లో చాలా భాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు అని అన్నారు. కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను వైసీపి ఖండిస్తోందని తేల్చి చెప్పారు. వక్ఫ్ బోర్డు భూములే 50% ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపించారు. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారని అన్నారు. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైసీపి వ్యతిరేకిస్తుందని అన్నారు. 

ఇది కూడా చదవండి: 'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..!  

నాన్ హిందువులు విరాళాలు...

ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు, ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలాచాలా అన్యాయం అని అన్నారు. వక్ఫ్ బోర్డు సిఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే మేము సహించం అని హెచ్చరించారు. జగన్ ఆదేశాలతో మేము ముస్లింల హక్కుల కోసం పోరాడతాం అని అన్నారు.\

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe