ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మనవడి హత్య!
కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది.
కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది.
మీరు పెంపుడు కుక్క పెంచుకుటున్నారా.? అయితే ఈ వార్త చదవాల్సిందే. పెంపుడు జంతువులు మన జీవితాలని అనందమయం చేసి ఆరోగ్యకర జీవనం గడపడంలో సాయపడతాయి. వాటిని ఇంటికి తెచ్చుకున్నాక చాలా సంతోషంగా ఉంటారు. మన మనస్సు బాగోలేనప్పుడు ఇవి మనల్ని నవ్వించి మనసు తేలికపడేటట్లు చేస్తాయి. కానీ అవి దూరం అయితే ఆ బాధ వర్ణతీతం.. ఓ పెంపుడు కుక్క యజమాని అందరికి అదర్శంగా నిలిచారు.
సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది.
చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం పిచ్చుక లాంటి వారు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని, అలాంటి వ్యక్తి చిన్నవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆ రోజు గొంతు విప్పింది చిరంజీవే అని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు ఉండవల్లి. ఆయన కారణంగానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
తెలుగు రాష్టరాల్లో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. నగరంలో తరచూ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సిటీలో మరో అగ్నిప్రమాదం జరిగింది. నరసాపురంలో సబ్ జైల్ సమీపంలో మోటారు సైకిల్ మెకానిక్ షాప్‌లో మంటలు చెలరేగాయి.
పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. వరదల వళ్ల ఇళ్లు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద ప్రభావిత ప్రాంత వాసులను పరామర్శించి వారికి కూరగాయలు,, గడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు
పోలవరం విషయంలో ఏపీ పంటపండింది.రాష్ట్ర ప్రభుత్వం మొర కేంద్ర ప్రభుత్వం చెవికి చేరింది. పదేపదే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.ప్రాజెక్ట్ లో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని ఇన్నాళ్లూ మొండికేసిన కేంద్ర ప్రభుత్వం..ఇప్పుడు శుభవార్త చెప్పింది.రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.ఇప్పుడు తాగునీటి విభాగం కోసం చేసే ఖర్చును కూడా తామే భరిస్తామని జలశక్తి మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు జవాబిచ్చారు.
చట్టం ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రక్షకభటులతో పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భాదితుడిపైనే ధర్డ్ డిగ్రీ చేసిన ఘటన ఏలూరు పట్టణంలో జరిగింది.