Breaking : ఏపీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ దుర్మరణం.!
ఏపీలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీలో తుఫాన్ తో నష్టపోయిన రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. సంక్రాంతిలోపు రైతులకు సబ్సీడీ అందేలా చూస్తామని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎండిన పొగాకు మొక్కలతో రైతులు నిరసన చేపట్టారు. నష్టపోయిన పొగాకు రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని ఆదుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
ప్రైవేటు ల్యాబ్ ల యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. వ్యాధి నిర్ధారించే పరీక్షలను ఆసుపత్రిలో చేయకుండా వైద్యులు ప్రైవేటు ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం ఫైర్ అయింది. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ఏ మాత్రం సీరియస్నెస్ లేదంటూ చురకలంటించింది. మరో 15 రోజుల్లో నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తిచేసి చూపించాలని ఆదేశించింది.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే వైసిపి విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేస్తామని తేల్చిచెప్పారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఈ క్రమంలోనే వైసిపిపై విమర్శలు గుప్పించారు. "వైసిపి చేస్తున్నది బీసీ యాత్ర కాదు..బేవర్స్ బస్సు యాత్ర.."అంటూ ధ్వజమెత్తారు.