Michaung Cyclone: ముంచేసిన మిచౌంగ్! ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. By Bhavana 05 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బాపట్ల వద్ద తీరం దాటింది.అయితే తుఫాన్ ప్రభావం రాష్ట్రం మీద బాగా చూపిస్తుంది. మరో రెండు మూడు గంటల్లో తీవ్ర తుఫాన్..తుఫాన్ గా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మిచౌంగ్ తుఫాన్ ఎక్కువగా పంటలపైనే చూపినట్లు తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో భీమవరం, కాళ్ల, ఉండి ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం వల్ల కరెంట్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోతలు కోసిన రైతులు ధాన్యం తడిసిపోయిందని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం మొత్తం నీటిలో తేలూతూ మురికి కాలువల్లో చేరుతుందని రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలిదిండి, ఉండి, పెదపాడు, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో వరి చేలు నీట మునిగిపోయాయి. తుఫాన్ ప్రభావం ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో బాగా చూపించింది. మిరప తోటలతో పాటు పొగాకు పంటలు బాగా ధ్వంసమయ్యాయి. వందల ఎకరాల్లో పూల పంటలు, బొప్పాయి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే పలు జిల్లాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చిత్తూరు జిల్లాలోని ఎన్టీఆర్ జలాశయంలో రెండు గేట్లను ఎత్తి వరద నీటిని అధికారులు బయటకు వదులుతున్నారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని తుఫాన్ ప్రభావం గురించి ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టం వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించాలని తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గంలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ కూడా అధైర్య పడొద్దని ఆయన తెలిపారు. ధాన్యం తడిచినప్పటికీ..ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల రైతులు వెంటనే తమ ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. Also read: రైల్వే ప్రయాణికులకు షాక్.. తుఫాన్ నేపథ్యంలో 305 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! #effect #michaung #ap #cyclone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి