Raghu Rama Krishna Raju : నాలుగేళ్ల తర్వాత సొంతూరుకు రఘురామకృష్ణంరాజు...అంతకు ముందు ఏం జరిగిందంటే..
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నాలుగేళ్ల తర్వాత తన సొంతూరుకు వెళుతున్నారు. ఈసందర్భంగా మధురపూడి విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నాలుగేళ్ల తర్వాత తన సొంతూరుకు వెళుతున్నారు. ఈసందర్భంగా మధురపూడి విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన పార్టీల్లో ముసలం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా ఏలూరులో సమావేశమైయ్యారు టిడిపి జనసేన నాయకులు. ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు- ఎవరైనా ముద్దు అంటూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మార్గాల్లో ఈ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవీ నరసాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. గోకరాజు రంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు కుమారుడు కూడా వైసీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు జరపాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరంలో ఇన్ఛార్జిలను వైసీపీ మార్చడంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. త్వరలోనే వీరంతా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.