విజయవాడ Yuvagalam: యువగళం పాదయాత్రలో హైటెన్షన్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతున్న టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరదం దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. By BalaMurali Krishna 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Differences in Denduluru YCP: దెందులూరు వైసీపీలో రగడ.. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై నేతల తిరుగుబాటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి చిక్కులు ఎదురువుతున్నాయి. 175కి 175 సీట్లు సాధిస్తామంటోన్న నేతలకు అసమ్మతి ఎదురవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసమ్మతి పోరును ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానం తలలు పట్టుకుంటోంది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంతి. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొఠారు అబ్బయ్య చౌదరికి టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి పాలవ్వడం ఖాయమని అంటున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయానికి కృషి చేస్తామని తెగేసి చెప్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో బయటపడ్డ వర్గపోరు ఇప్పుడు ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Filmymoji: కామెడీతో పొట్ట చెక్కలు చేసిన మధు, డూపేశ్.. క్లైమాక్స్‌లో మాత్రం ఏడుపొచ్చింది భయ్యా! ఆవకాయ కోసం అవకాశం కోసం వెయిట్ చేయకూడదు బ్రో.. మనమే క్రియేట్ చేసుకోవాలి లేకపోతే బద్దే మిగులుద్ది బ్రో.. అంటూ ఫిల్మీమోజీ ఎప్పటిలాగే ప్రేక్షకులను యూట్యూబ్‌కు కట్టిపడేసింది. 'సమ్‌థింగ్ మిస్సమ్మ' ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేసిన ఫిల్మీమోజీ లవర్స్‌ని ఎపిసోడ్ ఫుల్ మిల్స్ ట్రీట్ ఇచ్చిపడేసింది. విజయనగరం నుంచి జమ్మలమడుగుకి వెళ్లి చిక్కుకుపోయిన మధు చివరకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. సిరీస్ స్టార్టింగ్ నుంచి పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఫిల్మీమోజీ చివరిలో మాత్రం పేరెంట్స్, ఫ్రెండ్స్ సెంటిమెంట్ పెట్టి ఏడిపించేసింది. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Husband killed his Wife with Knife: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం గుడికి వెళ్లి వస్తోన్న భార్య సంధ్యను వెనుక నుండి వచ్చిన భర్త రాంబాబు చాకుతో పీకపై కోశాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు సంధ్య రాణిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సంధ్య రాణి రోడ్డుపైనే మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Teacher Beats 3rd class Students: హోమ్ వర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన హెడ్ మాస్టర్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ ఆయిషా ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్ మాస్టారు శామ్యూల్ విచక్షణారహితంగా చిన్నారి అని కూడా చూడకుండా.. కర్రతో ఇష్టం వచ్చినట్లు.. ఒంటిపై వాతలు తేలేలా చితక బాదాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ స్కూల్ లో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అది చూసిన చిన్నారి తల్లితండ్రులు మండిపడ్డారు. వెంటనే స్కూల్ కి వెళ్లి హెడ్ మాస్టారు శామ్యూల్ ను నిలదీశారు. అయినా హెడ్ మాస్టర్ శామ్యూల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru: కడుపులో కత్తెర మరచిన వైద్యులు..ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం! ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.గర్భిణీకి సిజేరియన్ చేసిన వైద్యులు..ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఓ మహిళ వారం క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. By Bhavana 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu and Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, పవన్ రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) శుభాకాంక్షలు వెల్లడించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu). ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అలాగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు.జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ దెబ్బ తీసే విధంగా రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు! లా అండ్ ఆర్డర్ ను దెబ్బ తీసే విధంగా రెచ్చగొట్టే ఎవరైనా ప్రకటనలు చేస్తే ఎవరినీ ఊరుకునేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. By Bhavana 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మనవడి హత్య! కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది. By Bhavana 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn