TDP-BJP: ఏలూరులో కూటమి నేతల మధ్య టికెట్ రగడ
ఏలూరు పార్లమెంట్లో ఆసంతృప్తి సెగలు కూటమిని కుదిపేస్తున్నాయి. బీజేపీ నేత గారపాటి సీతారామంజనేయ చౌదరిని ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన అనుచరులు, అభిమానులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ నేత పుట్టా మహేష్ కు సీటివ్వడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు.