AP: ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసి 60 రోజులు అవుతున్న ఇప్పటివరకు డబ్బులు వేయలేదంటూ నిరసనకు దిగారు.