Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఓ వాహన డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న మంత్రి కారు దానిని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.