Eluru: వైసీపీకి మరో ఎదురుదెబ్బ..టీడీపీలోకి ఆ మేయర్ దంపతులు! ఏలూరు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మేయర్ దంపతులు మంగళవారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయం గురించి వారు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో చర్చలు జరిపినట్లు సమాచారం.వీరితో పాటు మరో 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. By Bhavana 26 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Eluru: ఏలూరులో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. నగర మేయర్ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీలో చేరబోతున్నారు. అందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. మంగళవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. దీనికి సంబంధించి వారు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో చర్చించినట్లు తెలుస్తుంది. వీరితో నగర పాలక సంస్థకు చెందిన మరో 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. పసుపు కండువా కప్పుకునే విషయమై ఇప్పటికే కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. కాగా, మేయర్‌తో పాటు కార్పొరేట్లు టీడీపీ తీర్థం పుచ్చుకుంటే కనుక ఏలూరు నగర పాలక సంస్థ టీడీపీ కైవసం అవుతుంది. ఈ సందర్భంగా మేయర్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, లోకేశ్ సమర్థత కలిగిన నేతలు అని పేర్కొన్నారు. వారి సారథ్యంలో ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. Also Read: రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు నో ట్రాన్స్‌ఫర్స్! #tdp #mayor #ycp #eluru #nurzahan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి