Chandrababu : దేశంలోనే ఎక్కువ పింఛను ఇస్తున్నాం..ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని చెప్పుకున్నారు. పింఛన్ల విషయంలో ఏపీ తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు జమ్మల‌మ‌డుగులో ప‌ర్యటిస్తున్నారు.

New Update
N. Chandrababu Naidu

N. Chandrababu Naidu

Chandrababu: దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని చెప్పుకున్నారు. పింఛన్ల విషయంలో ఏపీ తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయని తెలిపారు. జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ  ఇంటికెళ్లిన చంద్రబాబునాయుడు వితంతు పెన్షన్‌ను అందించారు. ఏపీ సీఎం చంద్రబాబు జమ్మల‌మ‌డుగులో ప‌ర్యటిస్తున్నారు. ఈ ప‌ర్యట‌న‌లో చంద్రబాబు ఆటోలో ప్రయాణించారు. జ‌మ్మలమ‌డుగు చేరుకున్న త‌రువాత అక్కడ ఉన్న ఆటో ఎక్కి ప్రజావేదిక కార్యక్రమానికి చేరుకున్నారు. ఆటోలో ప్రయాణించినంత‌సేపు ఆటో డ్రైవర్ తో ముచ్చటించారు. ఆటోడ్రైవర్లకు ఉన్న స‌మ‌స్యల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆటో డ్రైవ‌ర్‌ను తీసుకువెళ్లి సంబంధిత అధికారికి చెప్పి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌, వైసీపీ నేతల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.


 చంద్రబాబు మాట్లాడుతూ ‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగితే మాపై విషం చిమ్మారని ఆరోపించారు. నాపై అభాండాలు వేసి అసత్యాలు రాశారన్నారు. మహిళా ఎమ్మెల్యేపైనా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గురించి ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరించాడని ఆరోపించారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి.. ఖండించాలి. నాయకుడే రెచ్చగొడితే ఇక కిందిస్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారన్నారు. ప్రతిచోటా డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయని.. జాగ్రత్తగా ఉండాలి. మభ్యపెట్టి, మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. సాక్షి పత్రికలో వచ్చిందని నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని ఎద్దేవా చేశారు.

Also Read: రేపే పీఎం కిసాన్.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు.. అన్నదాతలకు అలర్ట్!

కడప స్టీల్‌ప్లాంట్‌ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 2028 డిసెంబర్‌ నాటికి తొలి దశ పనులను పూర్తిచేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చానన్నారు. స్టీల్‌ప్లాంట్‌తో జమ్మలమడుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు వివరించారు. మంచి కార్యక్రమాన్ని చెడగొట్టడం.. పడగొట్టడం ఈజీ.. నిలబెట్టడమే కష్టమని వివరించారు. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసం జరిగిందని ఆరోపించారు... కేంద్ర పథకాలను నిలిపివేశారన్నారు. తల్లికి వందనం హామీని నిలబెట్టుకున్నామన్న చంద్రబాబు ఏడుగురు పిల్లలున్నా ఇస్తున్నామని తెలిపారు. అమెరికాకు గ్రాండ్‌ క్యానియన్‌లా మనకు గండికోట ఉంది. దాన్ని ఆకర్షణీయ ప్రాంతంగా తయారు చేస్తామన్నారు. అక్కడ రూ.85కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు. అక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో గండికోట ప్రాజెక్టును ఎన్టీఆర్ ప్రారంభిస్తే నేను పూర్తిచేశానని తెలిపారు. హంద్రీనీవా లైనింగ్‌ పనులు, చెరువుల మరమ్మతులు చేపట్టాం. 2024 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’అని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: పాక్, బంగ్లాపై ట్రంప్ టారిఫ్‌ మినహాయింపు.. భారత్‌పై అమెరికా కుట్ర!

Advertisment
తాజా కథనాలు