/rtv/media/media_files/2025/07/08/videotaping-married-woman-taking-bath-2025-07-08-09-41-57.jpg)
videotaping married woman taking bath
ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా.. ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై భర్త ప్రశ్నించడంతో ఆ వ్యక్తి అతడిపై దాడి చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్నానం చేస్తుండగా వీడియో
విజయనగరం జిల్లాకు చెందిన ఓ వివాహిత స్నానం చేస్తుంది. అదే సమయంలో శంకర్ అనే వ్యక్తి ఆమెను చూసి తన వద్ద ఉన్న మొబైల్‌తో వీడియో రికార్డు చేశాడు. అలా చేస్తున్న క్రమంలో ఆమె ఒక్కసారిగా శంకర్‌ను చూసి కేకలు వేసింది. దీంతో శంకర్ అక్కడ నుంచి పరారయ్యాడు.
అనంతరం ఆ మహిళ జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. దీంతో అతడు వెళ్లి శంకర్‌ను నిలదీశాడు. ఆపై అతడి వద్ద ఫోన్‌ను తీసుకున్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన శంకర్.. బాధితురాలి భర్తపై దాడి చేశాడు. అంతేకాకుండా అతడి వద్ద ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో వారు రంగంలోకి దిగి.. శంకర్‌ను టెక్నాలజీ సాయంతో పట్టుకుని అరెస్టు చేశారు.