AP: పూరిగుడిసెలో 12 అడుగుల భారీ గిరినాగు.. తాటాకుల మధ్య తిష్ట వేసి..!
అనకాపల్లి జిల్లా రైవాడలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ పూరిగుడిసెలో దాటాకులు మధ్య తిష్ట వేసి బుసలు కొట్టడంతో గుడిసెలో నివాసం ఉంటున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సుమారు గంట పాటు శ్రమించి.. ఓ గోనె సంచిలో బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.