/rtv/media/media_files/2025/04/27/9ps6jTZad826V9KIzzG3.jpg)
Visakhapatnam student rejected for job over looks
Viral Video నీ ఫేస్ లో గ్లో లేదు.. నీది ఫేక్ స్మైల్ అంటూ ఇంటర్వ్యూ కి వెళ్లిన ఓ అమ్మాయిని రిజెక్ట్ చేసింది ఓ కంపెనీ. టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా రంగు, రూపు అంటూ వివక్ష చూపిస్తున్నారు కొందరు. సామర్థ్యానికి బదులు పైపై మెరుగులు వెంట పడుతున్నారు. ఈ చేదు ఘటన విశాఖకు చెందిన స్వాతి అనే యువతికి ఎదురైంది.
చిన్నతనం నుంచి అవమానాలు
ఇటీవలే స్వాతి ఇన్ స్టాగ్రామ్ లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెబుతూ.. ఈ విషయాన్ని పంచుకుంది. తాను ఓ ఇంటర్వ్యూ కి వెళ్లగా.. అక్కడ 'ఫేస్లో గ్లో లేదని, ఫేక్ స్మైల్ అని రిజెక్ట్ చేశారని తెలిపింది. సామర్థ్యానికి బదులు.. కలర్ చూడడం ఏంటి? చిన్నతనం నుంచి ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది స్వాతి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది చూసిన నెటిజన్లు ధైర్యంగా ఉండాలంటూ ఆమెకు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు.
telugu-news | cinema-news | vishaka-news | viral-video | student