Vizag : సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్

ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. 

author-image
By Manogna alamuru
New Update
temple

Simhachalam: 

తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. మరింత పాకేలా కూడా కనిపిస్తోంది. తిరుమల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మిగతా దేవస్థానాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో సింహాచలం దేవస్థానంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యి సీజ్‌ చేసినట్టు ఆహార భద్రత అధికారి అప్పారావు తెలిపారు. దేవస్థానంలో వాడుతున్న నెయ్యి ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి సరఫరా అయిందని తెలిపారు.  దాన్ని మొత్తాన్ని సీజ్ చేయడమే కాక నెయ్యి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించామన్నారు. లడ్డూలో వాడే ఇతర పదార్థాలను కూడా ల్యాబ్‌ పరీక్షల కోసం పంపించినట్టు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆహారభద్రతాధికారి అప్పారావు తెలిపారు.

Also Read: కూటమి ప్రభుత్వం సినిమా కు ఎప్పుడూ అండగా ఉంటుంది‌‌– పవన్ కల్యాణ్

Advertisment
తాజా కథనాలు