AP Deputy Speaker: జనసేనకు డిప్యూటీ స్పీకర్.. ఆ ఎమ్మెల్యేకు ఛాన్స్?
డిప్యూటీ స్పీకర్ పదవిని కూటమి నుంచి జనసేనకు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంతం నానాజీ, లోకపు మాధవిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.