Perni Nani: ఆఖరికి దేవాన్ష్ కు కూడా 4 ప్లస్ 4 గన్‌మెన్‌లు.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..! జగన్ కు 986 మంది భద్రత సిబ్బంది ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే పేర్నినాని. జగన్ నుండి అధికారం లాక్కున్నా వీరికి ఇంకా కసి తీరలేదన్నారు. లోటస్ పాండ్ లో ఆక్రమణలు పడగొడితే జగన్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 25 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Perni Nani: చంద్రబాబు 2014 -19 అధికారంలో ఉన్నప్పుడు అతడి మనవడు దేవాన్ష్ కు కూడా 4 ప్లస్ 4 గన్‌మెన్‌లు ఇచ్చారని అన్నారు మాజీ ఎమ్మెల్యే పేర్నినాని. ఇప్పుడు జగన్ భద్రతపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం 196 మంది మాత్రమే జగన్ కు భద్రతా సిబ్బందగా ఉన్నారని.. అయితే, 986 మంది జగన్ కి భద్రత ఉన్నారని అసత్యాలు చెబుతున్నారన్నారు. సంబంధం ఏంటి ? ఈ క్రమంలోనే లోటస్ పాండ్ లో ఆక్రమణలు పడగొడితే జగన్ కు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాత్కాలిక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశారని.. ఇప్పుడు దాని తొలగించారని అన్నారు. సీఎం చంద్రబాబు కార్ ఏ సిగ్నల్ వద్ద అయిన ఆగిందా? నా కోసం ట్రాఫిక్ అపవద్దు అని చంద్రబాబు చెప్పారని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుండి ప్రచారం చేస్తున్నారన్నారు. Also Read: నీకు ఆ అర్హతే లేదు.. సభలో అలా చేసిన వ్యక్తి జగన్ ఒక్కరే.. మంత్రి సంధ్యారాణి సెన్సేషనల్ కామెంట్స్ అధికారం లాక్కున్నా.. జగన్ దగ్గర నుండి అధికారం లాక్కున్నా వీరికి ఇంకా కసి తీరడం లేదన్నారు.. ఇంకా తప్పడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా కరకట్ట నివాసం వైపు ఎవరినైనా అనుమతించారా? జగన్ ఇంటి ముందు రోడ్ మూసివేశరని తప్పుడు ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు. సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే కావాలని బెదిరించి జగన్ నివాసం ముందు రోడ్ ను తెరిచారన్నారు. విచారణ చేయండి.. లోకేష్ కు ఖలేజా ఉంటే తన జూబ్లీహిల్స్ ఇంటిని చూపించాలన్నారు. ప్రభుత్వం నుండి కమిటీ వేయాలని.. లోకేష్ జూబ్లీహిల్స్ ఇల్లు.. జగన్ ఇంటి విలువను లెక్కించాలని కోరారు. జగన్ బాత్ రూమ్ వస్తువులు.. లోకేష్ ఇంట్లోని బాత్ రూమ్ వస్తువులు లెక్కించాలన్నారు. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయండన్నారు. 70ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ వయాగ్రా వాడుతున్నారని దారుణంగా అసత్య ప్రచారం చేశారని.. చంద్రబాబు తన రాజకీయం కోసం ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆరోపించారు. #perni-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి