Kodali Nani: కుక్క కాటుకు చెప్పు దెబ్బలా..
చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు.
చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు.
తాడేపల్లిగూడెం సభలో జనసేన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథ సారథిగా వ్యవహరించిన శల్యుడితో పవన్ కల్యాణ్ ను పోల్చారు. శల్యుడిలా అందరినీ నిర్వీర్యం చేస్తాడని విమర్శలు గుప్పించారు.
మార్చి 18 నుంచి ఏపీ లో పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఏపీలో కూడా ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి.
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధాను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. రాధాను బందరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని, కొడాలి నాని రాధాతో భేటీ అయ్యారు.
మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీకి షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు.
ముమ్మిడివరం అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించడం బాధాకరమంటూ పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. తనకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీటు కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మైలవరం సీటుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం సమక్షంలో మాట్లాడి దేవినేని ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అన్నారు. అధిష్టానం నియోజకవర్గాన్ని ఎవరికి అప్పచెప్పితే దాని ప్రకారం నడుచుకుంటానన్నారు.
ఏపీలో బీజేపీ అభ్యర్థుల పోటీ చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు అంతా భావించారు. కానీ బీజేపీ ఎక్కువ సీట్లు అడిగిందని, దీంతో టీడీపీ, జనసేన అభ్యర్థులను ముందుగానే ప్రకటించారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. పురంధేశ్వరి దీనిపై క్లారిటీ ఇవ్వట్లేదు.
కృష్ణా జిల్లా పెడనలో అసంతృప్తి సెగ నెలకొంది. పెడన టిక్కెట్ ను కాగిత కృష్ణప్రసాద్ కు ప్రకటించారు చంద్రబాబు. దీంతో, సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశంలో ఉన్నట్టుండి అస్వస్థతకు గురైయ్యారు.