Kolikapudi: నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేసిన కొలిపూడి శ్రీనివాస్ రావు
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కృష్ణా జలాల కోసం కొలిపూడి శ్రీనివాస్ రావు నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కృష్ణా జలాల కోసం కొలిపూడి శ్రీనివాస్ రావు నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో పాల్గొన్నారు.
సికింద్రాబాద్, తిరుపతిలో ఎన్ఐఈఎల్ఐటీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల కార్యకలాపాలు తక్షణమే ప్రారంభించనున్నట్లు ఐటీ, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి ఏపీకి తాను సీఎం కాకుండా చిరంజీవి అడ్డకున్నారని వైసీపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆరోపించారు. తనకు, తన ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ సీఎం అవకాశం లభించకూడదనే మనస్తత్వంతో చిరు ఉండేవారని చెప్పారు. తాను చిరుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయింది. మే 13 నుంచి 19 వరకు EAPCET(JNTU కాకినాడ).. మే 8న ECET (JNTU అనంతపురం).. మే 6న ICET (SKU అనంతపురం).. మే 29 నుంచి 31వరకు పీజీ సెట్ (SVU తిరుపతి) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
ఈ రోజు దొండపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. కోటి 43 లక్షల నిధులతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మానవత్వం, కనికరం లేని క్రూరుడంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణ పీడను శాశ్వతంగా అంతమొందించాలన్నారు.
ఏపీలో వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వేమిరెడ్డి, మాగుంట, శ్రీకృష్ణదేవరాయలు తన అనుచరులతో సహా టీడీపీలోకి వెళ్లనున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రెండు రాష్ట్రాలు బాగుండాలి. మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకోండి. రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దు' అని హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేయటమే చంద్రబాబు 'బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' అని కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ మడిచి జేబులో లేదా ఎక్కడైనా పెట్టుకో లోకేష్ అంటూ ఎద్దేవ చేశారు.
కృష్ణా జలాల నీటి సమస్యను మూడు రోజుల్లో పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు హడావిడిగా వినగడప బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు.