షర్మిల ధర్నా .. విజయవాడలో హై టెన్షన్.. లైవ్
అమరావతి ఆదాయ పన్ను కార్యాలయం వైఎస్ షర్మిల ఎదుట ధర్నా చేస్తున్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ బ్రష్టు పట్టిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ బెదిరించలేదన్నారు.
అమరావతి ఆదాయ పన్ను కార్యాలయం వైఎస్ షర్మిల ఎదుట ధర్నా చేస్తున్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ బ్రష్టు పట్టిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ బెదిరించలేదన్నారు.
టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగితే.. డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నాదెండ్ల మనోహార్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు..ఎన్ని కేసులు వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల తెలిపారు.
AP: రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో ప్రచారంపై చర్చించనున్నారు. తాజాగా బీజేపీ 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. వారికి జీతాలు పెంచుతామంటూ చంద్రబాబు అంతా దొంగ నాటకాలడుతున్నారని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు.
టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ గోపాల్ యాదవ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం నుంచి పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైసీపీలో చేరారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. మహారాష్ట్రలో గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. కాగా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలో పోటీ చేయనున్నట్లు జేడీ తెలిపారు.
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేటుకుంది. కొత్త ఆటోనగర్ లోని ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకోవటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.