Nara Lokesh: తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్‌ని ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీలు చేశారు. అనంతరం కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని వెల్లడించారు. అయితే, మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను లోకేష్ ఇంటింటికి పంపిణి చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Nara Lokesh: లోకేష్ కాన్వాయ్ తనిఖీలు.. లక్షా 80వేల మానిఫెస్టో కాపీలు.. కారణం ఇదేనా..!
ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా మంగళగిరిలో లక్షా 80 వేల మానిఫెస్టో కాపీలను లోకేష్ ఇంటింటికి పంపిణి చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Translate this News: