MP Kesineni Nani: ఈ ఎన్నికల్లోనూ జరిగేది ఇదే
ఈ ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని గెలిపించి చంద్రబాబుకి మరోసారి బుద్ధి చెబుతారన్నారు ఎంపీ కేశినేని నాని. అరిచే కుక్కలకి, మొరిగే కుక్కలకి సమాధానం చెప్పవలసిన అవసరం తమకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని గెలిపించి చంద్రబాబుకి మరోసారి బుద్ధి చెబుతారన్నారు ఎంపీ కేశినేని నాని. అరిచే కుక్కలకి, మొరిగే కుక్కలకి సమాధానం చెప్పవలసిన అవసరం తమకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల మధ్య వలసలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు.
మహాసేన రాజేష్.. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. నిన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థుల పై తీవ్రస్థాయిలో దాడి చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. కాగా వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఈసీ వారికి ఆదేశం ఇచ్చింది.
జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు తన పదవికి రాజీనామ చేశారు. రాజీనామా విషయం వాట్సాప్ ద్వారా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపిన్నట్లు తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారన్నారు.
చంద్రబాబు కోసం బరితెగించి ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఉత్తరాలు రాస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే.. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . టాటా ఏస్ వ్యాన్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రగా గాయపడ్డారు.
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది.