Kodali Nani: వాళ్ల పేర్లు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారు: కొడాలి నాని వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. వారికి జీతాలు పెంచుతామంటూ చంద్రబాబు అంతా దొంగ నాటకాలడుతున్నారని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకాలని మండిపడ్డారు. వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసిందన్నారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం తమకు ఏ మాత్రం లేదన్నారు. Also Read: ఆసక్తికరంగా పులివెందుల రాజకీయం .. ఎన్నికల ప్రచారంలోకి అటు భారతి.. ఇటు షర్మిల..! ఐదేళ్ళుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తు సేవలు అందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని వాలంటీర్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు అంటున్నాడని..అయితే, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వారందరిని ఇంటికి పంపి జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి కార్యకర్తలను పెట్టుకొని వారికి జీతాలు ఇస్తాడన్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడని మండిపడ్డారు. #ex-minister-kodali-nani #ap-ex-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి