TET Exams: ఏపీ టెట్ 2024 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయయ్యాని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వివరించారు. రేపటి నుంచి 21వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలను నిర్వహించున్నారు. టెట్ పరీక్షలకు మొత్తం 4.27 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెగా డీఎస్సీకి ముందు టెట్ ఎగ్జామ్స్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. టెట్ పరీక్షల కోసం టోటల్‌గా 108 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరులోనూ..చెన్నై, బరంపురం, గంజాంలోనూ టెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అదనంగా సమయం కేటాయిస్తారు. సొంతంగా పరీక్షలు రాయలేని 813 మంది వికలాంగులు పరీక్ష రాయడానికి సహాయకులను అనుమతించారు.
ఎగ్జామ్ రూల్స్..
పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు.అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తమతో తీసుకువెళ్లడానికి అనుమతించరు. అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో హాల్ టికెట్లను పొంది ఉంటే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్టుమెంట్ అధికారికి ఆధారాలు చూపించి, వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు.