Japan: జపాన్‌లో పేలిన వరల్డ్‌ వార్ –2 బాంబ్

 జపాన్‌ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబ్ పేలింది. రెండో ప్రపంచం నాటి ఈ బాంబు ఇపుడు ఇన్నేళ్ళ తర్వాత పేలింది. దీని కారణంగా మియాజాకీ ఎయిర్ పోర్ట్‌లో పెద్ద గొయ్యి ఏర్పడింది.  ఈ కారణంగా 80 విమానాల రాకపోకలను ఆపేశారు.

author-image
By Manogna alamuru
New Update
bomb

World War-2 Bomb: 

జపాన్, అమెరికాల మధ్య రెండో ప్రపంచం యుద్ధం జరిగింది. ఆ టైమ్‌లో అమెరికా జపాన్ మీద చాలా బాంబులతో దాడులు చేసింది. అణుబాంబును కూడా అప్పుడే ప్రయోగించింది. అయితే ఇది జరిగి చాలా ఏళ్ళు గడిచి పోయింది.  ఆ చేదు జ్ఞాపకాల నుంచి జపాన్ కూడా బయటపడింది. హిరోషిమా, నాగసాకి నగరాలు మళ్ళీ పూర్తి రూపుదిద్దుకున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ వాటినన్నిటినీ గుర్తు చేస్తూ జపాన్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అక్కడి మియాజాకీ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబు ఇప్పుడు పేలింది. దీన్ని రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుగా జపాన్‌ అధికారులు గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. 

1943లో నిర్మించిన మియాజాకీ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని ఈ విమానాశ్రయంలో పాతి పెట్టిన  బాంబు.. ఇన్నేళ్ల తర్వాత పేలింది. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. పేలుడు సమయానికి సమీపంలో విమానాలు ఏమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. కానీ, గొయ్యి కారణంగా దాదాపు 80కి పైగా విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. 500 పౌండ్ల బరువున్న యూఎస్‌ బాంబు వల్ల ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించారు. మియాజాకీ ఎయిర్ పోర్ట్‌ ను వరల్డ్‌ వార్ –2 సమయంలో ట్రైనింగ్ ఫీల్డ్‌గా ఉపయోగించారు ఆత్మాహుతి దాడి మిషన్‌ కోసం కొందరు పైలెట్లు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. 

Also Read: Israel: ఐరాస ఛీఫ్‌ మా దేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదు–ఇజ్రాయెల్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు