కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దిగిన మెట్లపై వాళ్ళు పైకి ఎక్కారన్నారు. ఇందులో చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారన్నారు. తాను చిత్తశుద్ధితో వైసీపీలో పనిచేశానని.. జగన్ బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. జగన్ చుట్టూ ఉన్న కొటరీ నుంచి బయట పడిన రోజే ఆయనకు భవిష్యత్ ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, ప్రజలు, పార్టీ నష్టపోతుందన్నారు. కొటరీ వల్లనే జగన్ కు తాను దూరమయ్యానన్నారు.
ఇది కూడా చదవండి: Posani Krishna Murali: పోసానికి పెద్ద షాక్.. విడుదలకు బ్రేక్!
నాయకుడే మారాడు..
జగన్ మనసులో స్థానం లేదు అని వైసీపీని వీడుతున్నట్లు నేరుగా ఆయనకే చెప్పానన్నారు. భయం అనేది తన బ్లడ్ లోనే లేదన్నారు. ఒకప్పుడు నాయకుడిపై భక్తి, ప్రేమ ఉందన్నారు. కానీ ఇప్పుడు దేవుడిపై మాత్రమే ఉందన్నారు. తాను పడిన అవమానాలు, కష్టాలు వైసీపీలో ఇంకెవ్వరూ పడలేదన్నారు. ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసంతో బతికానన్నారు. తనను భయపడ్డానని.. ప్రలోభాలకు లొంగాను అని.. విశ్వాసనీయత కొల్పోయానని అన్నారన్నారు. తాను మారలేదని.. నాయకుడు మాత్రమే మారాడని అన్నారు.
ఇది కూడా చదవండి: వివేకా హత్య జరిగిన రోజు అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పిన చంద్రబాబు!
తాను వైసీపీకి మళ్లీ తిరిగి వెళ్లడం ఉండదన్నారు. కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసు విచారణకు సంబంధించి ఏపీ సీఐడీ ఈ రోజు విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో విజయసాయిని విచారించింది సీఐడీ. ఈ కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నారు.
Vijayasaireddy: జగన్ తో నాకున్న విభేదాలు అవే.. ఎట్టకేలకు నోరు విప్పిన విజయసాయి
కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దిగిన మెట్లపై వాళ్ళు పైకి ఎక్కారన్నారు.