YSRCP: మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు. ఎన్నికలకు ముందే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి ఆమె రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పద్మ జగ్గయ్యపేట సీటు ఆశించారు. కాగా ఆమెకు జగన్ టికెట్ ఇవ్వలేదు. దీంతో అదిష్ఠానంపై అసంతృప్తి, ఆగ్రహంగా ఉన్న పద్మ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా తాను రాజీనామా చేస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు పద్మ.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హై టెన్షన్.. ఆ నిర్మాణం కూల్చివేసిన ఆందోళనకారులు!
ఇది కూడా చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!
జగన్ మోసం చేశారు...
తన రాజీనామా కారణాన్ని పద్మ తెలిపారు. "పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు 'గుడ్ బుక్', ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది 'గుడ్ బుక్' కాదు “ గుండె బుక్ ”. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు 'గుడ్ బుక్' పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: షర్మిల, విజయమ్మకు జగన్ షాక్.. పిటిషన్!
పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు . అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. ఉన్న వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేసాను. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది YCPను వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను." అని బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: 80 విమానాలకు బాంబు బెదిరింపులు