Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం కేసులో బాధితుల ఉన్న వాళ్ళ పేర్లు ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతం చేస్తున్నారని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే బాధలో ఉంటున్న బాధితుల పేర్లను బయటకు చెప్పడం దారుణమని.. అది చట్టరీత్య నేరమని అన్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!
తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కాగా ఇటీవల వైసీపీ కి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. త్వరలోనే త తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వారంలోగా ఏ పార్టీలోకి వెళ్లాలనేది ప్రకటిస్తానని అన్నారు. కాగా తనకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులు అని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన పద్మ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ మోసం చేశారు...
తన రాజీనామా కారణాన్ని పద్మ తెలిపారు. "పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు 'గుడ్ బుక్', ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది 'గుడ్ బుక్' కాదు “ గుండె బుక్ ”. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు 'గుడ్ బుక్' పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: వైఎస్ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!
పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు . అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. ఉన్న వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేసాను. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది YCPను వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను." అని బహిరంగ లేఖను విడుదల చేశారు.