YCP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణ సందర్బంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని రవీందర్ రెడ్డి అన్నారు. దీంతో ఉదయం 10 గంటలకు కడప రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం పోలీసులు రవీందర్ రెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప జైలుకు తరలించారు.
41-ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాలని...
సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డికి 41-ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు
పోలీసుల నుంచి తప్పించుకున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్ర రెడ్డి కర్నూల్ నుంచి తెలంగాణకు పారిపోతుండగా మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ అతన్ని కడపకు తరలించారు. కాగా రవీందర్ రెడ్డి గతంలో మాజీ సీఎం జగన్ సతీమణి భారతికి పీఏగా పనిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. వారం క్రితం పోలీసులు రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 41నోటీసులు జారీ చేసి తాలూకా పోలీసులు వదిలేయడం చర్చనీయాంశమైంది. వర్రా అదృశ్యం కావడంతో ప్రత్యేక టీమ్ లను ఎస్పీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అతనిని మహబూబ్ నగర్ సరిహద్దుల వద్ద అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, తప్పుడు పోస్టులు పెట్టె వారిపై చర్యలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. సోషల్ మీడియాలో కొందరు నేతలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. కాగా వైసీపీ, కూటమి పార్టీలు ఈ పోస్టులపై విమర్శలు చేసుకుంటున్నాయని. తమ నేతలపై టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని వైసీపీ లేదు వైసీపీ వాళ్లే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
Also Read: నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. ఈ సోషల్ మీడియాకు తాను కూడా ఒక బాధితురాలినే అని చెప్పారు. గతంలో కూడా తన కూడా కొందరు ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు పెట్టారని వాపోయారు. సోషల్ మీడియాలో తప్పుడు ఫోటోలో, అసభ్యకరణ పోస్టులు పెట్టె వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని అన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ.. తన కూతుళ్లను కొందరు నీచులు వదలలేదని.. సోషల్ మీడియాలో వారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని.. అలాంటి వారిని శిక్షించకుండా ఉండాలా? అని ప్రశ్నించారు.