/rtv/media/media_files/2025/07/07/v-vasmhi-2025-07-07-15-22-10.jpg)
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్ళీ అస్వస్థత..
— Nagarjuna (@pusapatinag) July 7, 2025
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు.. pic.twitter.com/JuM9eAhxfR
నూజివీడు కోర్టు బెయిల్
నకిలీ ఇళ్లపట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వంశీ జూలై 2 బుధవారం రోజున విజయవాడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక రిలీజ్ తరువాత వల్లభనేని వంశీ తన భార్యతో కలిసి మాజీ సీఎం జగన్ కలిశారు.
ఇక వంశీని శనివారం మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు పరామర్శించారు. సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ బహిరంగంగా కలవడం ఇదే మొదటిసారి. వీరిద్దరి భేటీ తర్వాత పేర్ని నాని కూడా అక్కడకు వచ్చారు.