కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

కాకినాడలోని జేఎన్టీయూలో ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 14 టేబుళ్లపై మొత్తం 9 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో డిసెంబర్ 5న ఉపఎన్నికలు నిర్వహించారు.

New Update
Lok Sabha Elections: ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు.. ఎక్కడంటే

ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు కాకినాడలోని జేఎన్టీయూలో ప్రారంభమైంది. 14 టేబుళ్లపై మొత్తం 9 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరిగాయి.

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా

ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణించడంతో..

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఐదు జిల్లాల పరిధిలో 16,737 మంది ఓటర్లు ఉన్నారు. కానీ 15,490 ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం 3418 మంది ఓటర్లు ఉన్నారు. ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉపఎన్నికలు నిర్వహించారు.

ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

ఈ ఉప ఎన్నికల పోటీల్లో గంధం నారాయణరావు, దీపక్‌ పులుగు, డాక్టర్‌ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి, బొర్రా గోపీమూర్తి ఉన్నారు. విజేతగా నిలిచిన వ్యక్తికి రెండేళ్ల రెండు నెలల పదవీ కాలం ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!

Advertisment
తాజా కథనాలు