Talking: చనిపోయే ముందు మాట్లాడే మూడు మాటలు

చనిపోయే వ్యక్తులు తరచుగా తమ ప్రియమైన వారిని తలుచుకుంటారట. వారితో గడిపిన సమయాన్ని గుర్తుంచుకుంటారు. ఇంట్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలను చూసి, వారి వద్దకు తిరిగి వస్తున్నట్లు చెబుతారు.

New Update
Talking:

Talking

Talking: చనిపోయే ముందు చివరిగా ఏం మాట్లాడతారని చాలా మందికి డౌట్‌ ఉంటుంది. ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న జూలీ చాలా మంది రోగుల చివరి క్షణాలను చూసింది. ఒక వ్యక్తి మరణ సమయంలో ఎప్పుడూ నిజమే మాట్లాడుతాడని అంటోంది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన నర్స్ జూలీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాలను చెప్పింది. హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న జూలీ.. మరణం సమీపంలో ఉన్నప్పుడు ప్రజలు కొన్ని విషయాలను మాత్రమే గుర్తుంచుకుంటారని పేర్కొంది.

ఇది కూడా చదవండి:  భూమిపై అంతరిక్షానికి దగ్గరగా ఉండే వింత ప్రదేశం

నర్స్ జూలీ  @hospicenursejulie హ్యాండిల్‌తో ప్రజలు చనిపోయే ముందు వారికి కొన్ని కనిపిస్తాయని, ఎక్కువ మంది ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన తమ ప్రియమైనవారి ఆత్మలను చూస్తారని, కొంతమంది దేవదూతలను కూడా చూస్తారు. కొంతమంది దీనిని గృహప్రవేశంగా భావిస్తార ఆమె వెల్లడించారు. ఈ సమయంలో వారి శ్వాస విధానం మారడం ప్రారంభమవుతుందని, చర్మం రంగు కూడా మారడం మారుతుందని, ఇవే మరణానికి కొన్ని గంటల ముందు కనిపించే సంకేతాలని చెబుతున్నారు.

ఈ మూడు పదాలు మాట్లాడతారు:

చనిపోయే వ్యక్తులు తరచుగా తమ ప్రియమైన వారిని తలుచుకుంటారు. వారితో గడిపిన సమయాన్ని గుర్తుంచుకుంటారు. ఇంట్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలను చూసి, వారి వద్దకు తిరిగి వస్తున్నట్లు చెబుతారు. అంతే కాకుండా చనిపోయే ముందు ఎక్కువగా చెప్పే పదాలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అమ్మా నాన్నని తలుచుకుని ఈ లోకాన్ని విడిచిపెడతారని నర్సు తన సోషల్‌ మీడియాలో పెట్టింది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.   

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు ఉంటే అది మానసిక సమస్యే

 

Advertisment
Advertisment
తాజా కథనాలు