కాకినాడ జిల్లా తునిలోని రౌతులపుడి దగ్గర్లో ఆర్టీసీ బస్సులో సమస్య తలెత్తింది. దీంతో ఎంత ప్రయత్నించినా మళ్లీ స్టార్ట్ కాలేదు. దీంతో విద్యార్థులను ఎంటర్‌ట్రైన్ చేసేందుకు బస్సు డ్రైవర్ కిందకి దిగి.. సరదాగా ఎన్టీఆర్ ‘దేవర’ మూవీలోని దావుదీ సాంగ్‌కు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యాయి.
Also Read: దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి
డ్యాన్స్ వేసినందుకు జాబ్ ఫసక్
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో డ్రైవర్ లోవరాజును ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో పిల్లల్ని పోషించుకోవడం ఎలా అంటూ లోవరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో బస్సు ఆగినపుడు సరదాగా డాన్స్ వేసినందుకు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించడంపై విమర్శలు వెలువెత్తాయి.
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా
పలువురు నెటిజన్లు సైతం లోవరాజుకి మద్దతుగా నిలిచారు. ‘‘డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారంటూ’’ మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. అంతేకాకుండా లోవరాజు పరిస్థితిపై RTV సైతం వరుస కథనాలు అందించింది. దీంతో RTV కథనాలపై మంత్రి లోకేష్ స్పందించారు.
Also Read : అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్?
ఈ మేరకు డ్రైవర్‌కు భరోసాగా నిలిచారు. లోవరాజును ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అమెరికా నుంచి వచ్చిన తర్వాత తనను కలుస్తానని కూడా ట్వీట్ చేశారు.
Also Read: డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..
డ్రైవర్ లోవరాజు చేతికి మళ్లీ స్టీరింగ్
అలాగే త్వరలోనే మంత్రి లోకేష్‌ను కలిసి.. ఉద్యోగం పర్మినెంట్ చేయాలని కోరుతానని లోవరాజు అన్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ లోవరాజు చేతికి మళ్లీ స్టీరింగ్ వచ్చింది. తుని ఆర్టీసీ డిపో నుండి లోవరాజుకి ఫోన్ వచ్చింది. లోవరాజుపై సస్పెన్షన్‌ను అధికారులు ఎత్తివేశారు. ఈ మేరకు విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.