TTD చైర్మన్, ఈవో తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ స్పందించారు. క్షమాపణ చెబితే పోయిన వారు తిరిగి వస్తారా? అని ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ రోజు పిఠాపురం పర్యటనలో పవన్ మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణ చెప్పానన్నారు. క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అంటూ ఫైర్ అయ్యారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలా రావు, అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అధికారులు తప్పు చేయడంతో.. ప్రజలు సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీఎంకు ఇండైరెక్ట్ కౌంటర్...!క్షమాపణలు చెబితే తప్పులేదు కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన తిరిగి రారు కదా ఎవరో ఏదో అన్నారని వాటికి అన్నిటికి స్పందించవలసిన అవసరం లేదు - టీటీడీ చైర్మన్ pic.twitter.com/QUgVPNK5gH — greatandhra (@greatandhranews) January 10, 2025 బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇదిలా ఉంటే.. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ రోజు టీటీడీ పాలకమండలి భేటీ జరిగింది. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారికి కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సంతాపం తెలిపింది. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని తీర్మానించింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ.5 లక్షల చొప్పు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ.2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడించింది. Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్.. అమెరికాలో ఏం జరుగుతోంది? తప్పు చేసిన వారిని వదిలిపెట్టం.. ఈ ఘటనపై న్యాయ విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తప్పిదం జరిగింది వాస్తవమని.. తప్పు చేసినవారిని ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. Also Read: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్ మిగిలిన 7 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి ఏరోజుకు ఆరోజే టోకన్లు జారీ చేస్తామన్నారు. వైకుంఠ ద్వార దర్శనంపై సీఎం అభిప్రాయాలపై చర్చిస్తామన్నారు. ఈ ఏడాది పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఇలానే కొనసాగుతాయని తెలిపారు. మృతిచెందిన 6 కుటుంబాల్లోని పిల్లల విద్య ఖర్చులు టీటీడీ భరిస్తుందన్నారు. ఇది కూడా చదవండి: Fun Bucket Bhargav: బిగ్ షాక్..! ఫన్‌బకెట్ భార్గవకు 20 ఏళ్ల జైలు Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ