జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనలు రద్దు చేయనున్నట్లు చెప్పారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని అర్చకులు సిబ్బంది శుద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 6వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని బీఆర్ నాయుడు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్న అర్చకులు, సిబ్బందికోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా జనవరి 7వ తేదీన విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 6వ తేదీ ఎలాంటి సిఫార్సు లేఖలు… — B R Naidu (@BollineniRNaidu) December 25, 2024